మొటిమలు
టీనేజ్ నుంచి మధ్యవయసు వచ్చేవరకు ఆడవారిని ఎక్కువగా బాధించే సమస్యలలో మొటిమలు ఒకటి. మొటిమలు మహిళల సౌందర్యాన్ని సవాల్ చేసే సమస్య. మగ వారిలో కుడా కనిపించును . పింపుల్స్ సాధారణంగా 12 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల వరకూ రావడం జరుగుతుంది.
మృదుత్వంతో మెరిసిపోవాల్సిన మోముపై చిన్న మొటిమ వస్తే.. అమ్మాయిల కంగారు అంతాఇంతా కాదు. అది తగ్గేదాకా రకరకాల చికిత్సలు ప్రయత్నిస్తారు. చాలామందిని వేధించే ఈ మొటిమలు ఎందుకు వస్తాయి.. నిర్లక్ష్యం చేస్తే ఎదురయ్యే ఇతర సమస్యలు గురించి వివరంగా తెలుసుకుందాం.
కౌమారదశలో ప్రవేశించే వారికే మొటిమల సమస్య ఉంటుందనుకుంటారు చాలామంది. నిజానికి, నలభై ఏళ్లు పైబడినవారికీ వస్తాయివి. కేవలం ముఖంపైనే కాదు.. చేతులు, ఛాతి, వీపు వంటి భాగాలపైనా మొటిమలు వస్తాయి. నాలుగు స్థాయుల్లో వేధించే ఈ సమస్య తీవ్రత కొందరిలో ఎక్కువగా ఉంటుంది. మొటిమలు వచ్చి తగ్గడంతో పాటు.. కొందరికి మచ్చలు పడితే.. మరికొందరికి గుంటల దాకా దారితీస్తాయి. అవి తగ్గడానికి చాలా సమయం పడుతుంది. ఎంతో బాధించే వీటి రాకకు కారణాలనేకం.
- హార్మోన్లలో చోటుచేసుకునే మార్పులు..
- చర్మంలో నూనె గ్రంథుల పనితీరు,
- బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్ వంటివి ఇందుకు ప్రధాన కారణాలు.
- పరోక్షంగా ఒత్తిడితోనూ కొన్నిసార్లు వస్తుంటాయి.
- పీసీఓడీ (పాలిసిస్టిక్ ఓవరీస్) సమస్య,
- గర్భనిరోధక మాత్రలు,
- కొన్నిరకాల ఉత్ప్రేరకాలు,
- క్షయకు వాడే మందులు.. వంటివీ ఈ సమస్యకు దారితీస్తాయి.
ఏర్పడే విధానము:
మొటిమలు (Acne) స్వేదగ్రంధులకు సంబంధించిన చర్మ వ్యాధి. మొటిమలు ముఖము పైనే కాకుండా మెడ, భుజము, ఛాతి పైన కూడా పుడుతూ ఉంటాయి. 70% నుండి 80% వరకు యువతీ యువకులలో ఇవి కనిపిస్తాయి. యవ్వనములో హార్మోనులు (ఆడువారిలో-ఈస్త్రోజన్, ప్రొజిస్త్రాన్, మగవారిలో-టెస్టోస్టిరాన్) సమతుల్యము (ratio) లోపించడము వలన సబేసియస్-గ్రంధులు నుండి సెబమ్ (oil like substance) ఎక్కువగా తయారై మొటిమలకు దారితీస్తుంది. మొటిమలు చిన్నవి, పెద్దవి అని రెండు రకాలుగా ఉంటాయి. చిన్నవి యుక్తవయసులో కొద్దికాలము పాటు కనిపించినా ఎటువంటి బాధ ఉండదు, వీటివలన ముఖముపై మచ్చలు ఏమి మిగలవు. పెద్దవి-Acne vulgaris అనేవి నొప్పి, దురదతో కూడికొని ముఖముపై మచ్చలు ఏర్పడే రకము. సాదారణముగా మొటిమలు ముఖముపైనే కాక మెడపైన, భుజాలపైన, ఛాథిపైన కూడా పుట్టవచ్చును.
ముఖముపైన ఉండే నూనె గ్రంధులు (sabesious glanda) చర్మములోని వెంట్రుకల కుదుల్లలో ఉండి యుక్తవయస్సులో ఎక్కువగా జిడ్డును తయారుచేయును. వెంట్రుక కుదుల్ల రంద్రాలు మూసుకుపోవడము వలనో, బయటి సూక్షమజీవుల (ex. proprioni bacterium acnes) వలనో ఇన్పెక్షన్ కి గురై పుండుగా మారి, పుండుమానిపోయి మచ్చగా మిగులును. చిదపడము, గోకడము వలన గోళ్ళనుండి ఇన్పెక్షన్ అయి ఎక్కువగా బాదపెట్టును. ఆహారపదార్దములు ముఖ్యముగా నూనెలు, క్రొవ్వులతో కూడిన పదార్దములు తినడము వలన మొటిమలు వస్తాయన్నది అపోహ మాత్రమే. మొటిమలుపై ప్రభావితము చూపే అంశాలు :
- మానసిక వత్తిడి ఎక్కువైనపుడు
- ఆడు వారిలో PCOD (Poly Cystic Overian Disease) వున్నపుడు
- వంశపారంపర్యము (కొంతవరకు)
- ఆయిలీ స్కిన్ తత్వం ఎక్కువ వుండడం.
ఆయుర్వేద చికిత్స
(మొటిమలు )
Naveda Herbal Blood Purifier Syrup
మొటిమలు, మొటిమలు, సంక్లిష్టత మొదలైన వాటితో సహా చర్మ వ్యాధులకు సహాయపడుతుంది మరియు చర్మానికి మెరుపును తెస్తుంది. రక్తంలోని టాక్సిన్స్‌ను శుభ్రపరుస్తుంది, ఇది మొటిమల మూలాలను తొలగించడం ద్వారా చర్మం యొక్క ఆకృతిని మెరుగుపరుస్తుంది, రక్తాన్ని శుద్ధి చేస్తుంది మరియు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
Rose Water
- రోజ్ వాటర్ మోటిమలు మచ్చలకు సహాయం చేస్తుంది.
- రోజ్ వాటర్‌లో విటమిన్ సి మరియు ఫినాలిక్స్ పుష్కలంగా ఉన్నాయి.
- రోజ్ వాటర్ కోతలను నయం చేయడంలో సహాయపడుతుంది రోజ్ వాటర్ కోతలు, కాలిన గాయాలు మరియు మచ్చలను నయం చేయడంలో సహాయపడుతుంది.
- అదనపు నూనెను తొలగిస్తుంది మరియు మొటిమల పరిమాణాన్ని తగ్గిస్తుంది.
- రోజ్ వాటర్ చర్మం యొక్క pH బ్యాలెన్స్‌ను నిర్వహించడానికి సహాయపడుతుంది.
- మొటిమల గుర్తులను పోగొట్టండి.