మధుమేహం & చక్కర వ్యాధి
Complications may affect your Body
Insulin Production in our Body
Diabetes Excercise
ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారము మధు మేహానికి ఇండియా కేంద్రబిందువు గా మారినది . సుమారు 4%-5% వరకు మధుమేహ రోగులు ఉన్నారు . 2025 నాటికి ఈ సంఖ్యా 10% కి పెరగవచ్చును.
మధుమేహముఅంటేఏమిటి ? :
రక్తం లో షుగర్ స్తాయి అదుపు తప్పి అసాధారణ స్థితికి చేరినందువల్ల తలెత్తే పర్ష్టితిని దయాబిటిస్ లేదా షుగర్ వ్యాధి అంటాము . ఇది బయటకు కనిపించని ప్రాణాంతక వ్యాధి . ఈ వ్యాధిని నియంత్రించకపోతే క్రమంగా దాని ప్రభావాన శరీరం లోని మిగిలిన ప్రధాన అంగాలన్ని తమ సమర్ధతను కోల్పోతాయి . గుండె ,మెదడు ,కళ్లు , మూత్రపిండాలు , పాదాలు , నాడులు ,వగైరా అన్ని షుగర్ వ్యాధి వల్ల కుంటుపడే అవకాశముంది . ఒక సారి షుగర్ జబ్బు వస్తే దాన్ని పూర్తిగా తగ్గంచే మార్గం లేదు ..అదుపులో ఉంచికుని కాలం నెట్టుకురావటం మాత్రమే చేయగలము.
ఎందుకు వస్తుంది ? :
ఇన్సులిన్ అనేది శరీరం యొక్క ప్యాంక్రియాస్‌లో ఉత్పత్తి అయ్యే హార్మోన్. మానవులు తినే ఆహారంలో లభించే కార్బోహైడ్రేట్లు రక్తప్రవాహంలో చక్కెరను ఏర్పరుస్తాయి మరియు శరీరానికి శక్తిని అందించడానికి శరీరంలోని కణాలు మరియు కణజాలాలలోకి ప్రవేశిస్తాయి. కణాలలోకి చక్కెరను అనుమతించడం ద్వారా శరీరానికి శక్తిని అందించడంలో “ఇన్సులిన్” పాత్ర పోషిస్తుంది. శరీరంలో ఇన్సులిన్ ఆగిపోయినప్పుడు లేదా తగినంతగా ఉత్పత్తి కానప్పుడు, రక్తంలో చక్కెర కణాలలోకి ప్రవేశించదు మరియు రక్తంలోనే ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది.
యూరిన్షుగర్అంటేఏమిటి ?
మూత్రపిండాలు రక్తాన్ని ఫిల్టర్ చేస్తున్నప్పుడు, అదనపు చక్కెర మూత్రం ద్వారా విడుదలవుతుంది. ఫలితంగా, రక్తంలో అదనపు చక్కెరను వదిలించుకోవడానికి మూత్రపిండాలు చాలా కష్టపడాలి. ఈ అదనపు చక్కెరను యూరిన్ షుగర్ అని కూడా పిలుస్తారు, ఇది మూత్రపిండాలకు హాని కలిగిస్తుంది. మూత్రపిండాలు దెబ్బతినడంతో పాటు, శరీరంలోని ఇతర భాగాలలో కళ్ళు, మెదడు, గుండె, నరాలు మరియు రక్త నాళాలు ఉన్నాయి. మీరు గాయపడినట్లయితే, అది త్వరగా నయం కాదు. మీ రోగనిరోధక వ్యవస్థ బలహీనపడినందున, ఇన్ఫెక్షన్ రావచ్చు.
వ్యాధి లక్షణాలు ? :
- అతి మూత్ర విసర్జన
- అతి గా ఆకలి ,
- దాహము ఎక్కువగా వేయడం ,
- ఎటువంటి కారణాలు లేకుండా హఠాత్తుగా బరువు తగ్గడం ,
- మర్మంగాల లో దురద , మంట ,
- అలసట, అరికాళ్ళలో తిమ్మిరులు , మంటలు ,
- గాయాలు తొందర గా మానక పోవడం ,
- నీరసం , నిస్సత్తువ , చిక్కిపోవడం.
అయితే ఎటువంటి లక్షణాలు కనిపించకుండానే కొన్నిసమయాల్లో రొటీన్ గా చేసే పరీక్షల వల్ల Diabetes బయటపడవచ్చు
వ్యాధి రకాలు? :
ఇది మధ్య వయస్సు వారి వ్యాధి గా పేర్కొంటారు . చిన్న పిల్లలలో అరుదు గా కనిపించవచ్చును . అందుచే ఈ వ్యాధి 4 రకాలు .. టైపు 1 , టైపు 2. అనే రెండు రకాలు .3. డయాబిటీస్ ఇన్‌సిపిడస్ , 4. జెస్టేషన్ డయాబిటీస్
టైపు 1 : దీన్ని ఇన్సులిన్ డిపెండెంట్ దయబిటిస్ (insulin dependent) అని అంటాము .ఇది ఎ వయసు లోనైనా కలుగ వచ్చును . . . కాని ఎక్కువ గా పిల్లల లో వస్తుంది . ఈ తరహా దయబిటిస్ లో insulin ఉత్పత్తి పూర్తిగా ఆగిపోతుంది . కారణాలు ఎన్నో .. క్లోమగ్రంది (Pancreas)దెబ్బతిని insulin ఉత్పత్తి చెయ్యదు . కాబట్టి insulin ఇంజెక్షన్ లు తీసుకోవడం తప్ప వేరే ట్రీట్మెంట్ లేదు .
టైపు 2 : మద్య వయసు వాళ్ళకి వచ్చేది .. ఇది వంశ పారంపర్యం గా వచ్చే వ్యాధి . ఈ తరహ వ్యాధి లో insulin ఉత్పత్తి జరుగుతున్నా దాని ప్రభావం కణాల మీద ఉండదు . కణాలకు చేరాల్చిన షుగర్ రక్తం లో నిలిచిపోతుంది . టైప్-2 డయాబిటీస్ వచ్చినవారు ముందు 10 – 15 సంవత్సారాలు నోటి ద్వారా ఇచ్చే మందుల తో నియంత్రించిన తర్వాత బ్రతికి ఉంటే insulin తీసుకోక తప్పనిసరి పరిస్తితి ఏర్పడుతుంది . టైపు 2 దయబిటిస్ లో మరో రకము–meturity onset Diabetes.= ఇది 25 ఎల్ల వయసు లోపు వారికి వస్తుంది .
Gestational Diabetes : ఇది గర్భిణి గా ఉన్నపుడు మొదటి సరిగా ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి . రక్తం లో షుగర్ నియంత్రించేందుకు insulin ఇంజక్షన్ లూ ఆహారపు నియమాలు రెండు కలిపి పాటించాలి . ప్రసవం అయిన తరువాత ఇది తగ్గిపోతుంది … కొంత మంది లో టైపు 2 డయబిటీస్ గా కొనసాగే అవకాసం ఉంది .
జాగ్రత్తలు :
- తల్లి దండ్రులలో ఎ ఒక్కరికైనా డయాబెటిస్ ఉంటే పిల్లలకు వచ్చే అవకాసము 35 శాతము వరకు ఉంటుంది . తల్లిదండ్రులిద్దరకి డయాబెటిస్ ఉంటే ఆ అవకాసము 60 శాతము ఉండును .
- ఆహారపు అలవాట్లు , ఆహారము పై నియంత్రణ , వ్యాయామము ద్వార డయాబెటిస్ కొంత మేరకు దూరము చేయవచ్చును .
- మధ్య వయసుకు చేరిన వారు ప్రతి మూడు మాసములకు రక్తపరేక్షలు చేయించుకోవాలి .
- శారీరక శ్రమ చేయకుండా ఒకే చోట కూర్చొని పనిచేసేవారికి డయబిటీస్ వచ్చే అవకాసము ఉంటుంది .
- డయాబెటిస్ రోగులు వారి పాదాలను జాగ్రత్తగా రక్షించుకోవాలి , ఎవ్విదమైన దెబ్బలు తగులకుండా చూసుకోవాలి. ఇన్ఫెక్షన్ దరిచేరకుండా జాగ్రత్తలూ తీసుకోవాలి ..
https://youtu.be/L4EYJRr1t48?si=FPkw1PIgSspbkZeo
డయాబెటిస్ ఆయుర్వేద చికిత్స
Dia Plus Power
డయాప్లస్ మధుమేహ వ్యాధిగ్రస్తులకు చక్కని వరం. క్రమం తప్పకుండ కొన్ని రోజులపాటు వాడితే రక్తంలో షుగర్ స్థాయిని నియంత్రించడంతో పాటు లివర్ , కిడ్నీలను కూడా శక్తివంతం చేస్తుంది. ఈ మందులతో ఎలాంటి దుష్పలితాలు ఉండవు . ఇతర హెర్బల్ ఉత్పత్తులతో కానీ ,కలిపి స్వీకరించవచ్చు .
వాడే విధానము : రోజు రెండు పూటలు ఒక టీస్పూన్ గ్లాస్ తో కలిపి తీసుకొనవేలేను .
మధుమేహం & చక్కర వ్యాధి Read More »